![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -293 లో..... భద్రం రియల్ ఎస్టేట్ లో మోసం చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తాడు. ఒకతను భద్రం దగ్గరికి వచ్చి ఇలా మోసం చేస్తావా అంటూ అడుగుతాడు. దాంతో అతడిని చంపేస్తానంటూ భద్రం బెదిరిస్తాడు. నిన్ను కూడా ఎదురించే వాళ్లు వస్తారంటూ అతను వెళ్ళిపోతాడు. అప్పుడే భద్రం దగ్గరికి శివ మరియి సందీప్ ఫ్రెండ్ వస్తారు. సీతాకాంత్ తెలుసు కదా వాళ్ళ కుటుంబంలో ఏదో గొడవలు వచ్చాయంటూ చెప్తాడు. నేను చెప్పినట్టు చేయమని భద్రానికి శివ చెప్తాడు ఆ తర్వాత ఎన్నో సార్లు సీతాకాంత్ ని ట్రాప్ చేయాలని చూసా కానీ వీలవ్వలేదు.. ఇప్పుడు వీళ్లని వాడుకొని ఆస్తులన్నీ లాక్కుంటానని భద్రం అనుకుంటాడు.
మరొకవైపు సీతాకాంత్, రామలక్ష్మి లు రూమ్ కోసం వెతుకుతారు. అప్పుడే ఒక టూలెట్ బోర్డు కన్పించడంతో లోపలికి వెళ్తారు. అక్కడ ఒక ముసలావిడ కష్టపడుతుంటే.. తనకి ఇద్దరు సాయం చేస్తారు. ఆ తర్వాత ముసలావిడ వాళ్ళకి రూమ్ చూపిస్తుంది. ఇద్దరు కలిసి రూమ్ ని క్లీన్ చేస్తరు. మరొకవైపు సందీప్ ధన ఇద్దరు ఫుల్ గా తాగుతుంటారు. మనం దురదృష్టవంతులం ఇంత ఆస్తులున్నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అనుకుంటారు. వెయిటర్ ని పిలిచి ఇంకా తీసుకొని రా అంటాడు. మీరు డబ్బు ఇవ్వలేదు. ఇస్తేనే ఇంకా మీకు మందు ఇవ్వమన్నాడని అతను అనగానే అతనిపై ఇద్దరు కోప్పడతారు. అప్పుడే అక్కడికి భద్రం శివలు వస్తారు. శివకి డబ్బు ఇచ్చి భద్రం పంపిస్తాడు. శివ వచ్చి నేను బిల్ పే చేస్తాననగానే ..అరేయ్ డబ్బు నన్నే అడిగేవాడివి ఎలా డబ్బు కడతానంటున్నావని సందీప్ అంటాడు.
మా ఆస్తుల విషయం మా తోబుట్టువులు అడ్డుపడుతుంటే ఒకతను సాయం చేసాడని భద్రం గురించి వాళ్ళకి చెప్తాడు. అలా చెప్పగానే మేము అలాంటి ప్రాబ్లమ్ లోనే ఉన్నాం. మాకు ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేయమని సర్ కి చెప్పమని సందీప్ అంటాడు. అవునా సర్ ఇక్కడికి వస్తానన్నాడంటూ అదిగో సర్ వచ్చాడని భద్రాన్ని చూపిస్తాడు శివ. ఆ తర్వాత సందీప్ జరిగింది మొత్తం భద్రానికి చెప్తాడు. నేను చూసుకుంటానని భద్రం చెప్తాడు. వీళ్ళని నమ్మించానని భద్రం అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి, సీతాకాంత్ లు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |